తొలి మహిళా ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నన్ను గుర్తించటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది జీవజాతుల పై అమితమైన ప్రేమ గల వారు మాత్రమే ఇటు రాగలరు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న వారే అడవిలో అడుగు పెట్టాలి అంటుంది రాధిక రామస్వామి. 17 సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో క్రూర మృగాలు అద్భుతమైన పక్షుల ఫోటోలు తీశారు. తమిళనాడులోని తేని జిల్లా పశ్చిమ కనుమల దగ్గర ఉన్న వెంకటాపురం ఆమె పుట్టిన ఊరు అక్కడి ప్రకృతి దృశ్యాలే ఆమెను ఫోటోగ్రాఫర్ చేశాయి. ఎన్నో పురస్కారాలు అభినందనలు దక్కాయి ఇంటర్నేషనల్ కెమెరా ఫెయిర్ అవార్డ్ ఉమెన్ ఆఫ్ ఎక్స్ లెన్సీ ఈ వంటి అవార్డ్ లు తీసుకున్నారు రాధిక. అభయారణ్యాలే ఆమె ఇల్లు అందులో జీవరాసులు లే ఆమే ప్రపంచం.

Leave a comment