టమోటా ధరలు పెరిగిపోయి కొనాలంటే భయం వేస్తోంది చాలామందికి ప్రతి కూరల్లోనూ టమోటాలు వాడే అలవాటు చాలా మందికి ఉంటుంది. అలాంటప్పుడు టమోటాకు ప్రత్యామ్నాయంగా కొన్ని పదార్థాలు ఉపయోగించుకోవచ్చు. కూరల్లో పచ్చిమామిడికాయ పొడిని వేస్తే అచ్చం టమోటా రుచి వస్తుంది. ఎండిన ఉసిరి ముక్కల్ని నీళ్లలో నాననిచ్చి మెత్తగా పేస్ట్ చేసి కూరలో వాడుకోవచ్చు. కాస్త పుల్లగా ఉన్న పెరుగు వేసినా టమేటా రుచి ఉంటుంది. కూర ఉడికే సమయంలో కాస్త చింతపండు గుజ్జు వేస్తే టమేటా తో పని ఉండదు.

Leave a comment