Categories
గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు వాడితే కురుల సహజ అందం పాడైపోతుంది అనుకొంటారు ఇటలీ మహిళలు.వాళ్ళకు ఆలివ్ నూనెను మించిన దివ్య ఔషధం లేదు. ఇక్కడి మహిళలు వారానికి ఒక సారి ఏం చేస్తారంటే ఒక పెద్ద చెంబు ఆలీవ్ నూనె తలంతా పట్టిస్తారు. దీని వల్ల వెంట్రుకలకు చక్కని పోషణ లభిస్తుందని అనుకొంటారు. అలాగే వెంట వెంటనే తల స్నానం చేసేందుకు ఆసక్తి చూపించరు. మన పల్లెటూరు ఆడవాళ్ళలాగా జుట్టుకు నూనె పట్టించి ఒక్క వెంట్రుక కూడ చెదరకుండా అందమైన ముడులు వేసుకొంటారు.