Categories
హెయిర్ డై ల్లో ఇప్పడు అనేక మార్పులు వచ్చాయి.వేసుకొని ఐదు నిమిషాలంటు చాలు అని యాడ్స్ లో చూస్తుంటాం. అయితే ఐదు నిమిషాలు ఉండేవి అయినా అరగంటపాటు ఉండాల్సినవి అయినా వాడుక సమయంలో జాగ్రత్తలు చాలా అవసరం .హెయిర్ డై పాకెట్ పైన కనిపించే కలర్ మనం వేసుకొన్నప్పుడు కనిపించకపోవచ్చు. హెయిర్ డై డబ్బాలో కనిపించే కలర్ ఛార్ట్ వెతికి సరైన రంగు గమనించుకోవాలి. గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెల్లో కావసినంత రంగు ఇకే సారి కలుపుకోవాలి. రంగు ఎక్కువ కాలం ఉండాలంటే హెయిర్ డైలో ఒక స్పూన్ కార్న్ స్టార్ట్ కలపాలి. అలాగే రంగు వేశాక ఆ రంగులో ఉండే రసాయనాలు తలపై నిలిచి ఉండకుండా మరుసటి రోజు హెన్న అప్లైయ్ చేస్తే మంచిది..