సంప్రదాయ దుస్తులపైకి అందమైన రూపాల్లో లట్కన్లు వచ్చాయి. చక్కని ప్యాబ్రిక్ తో లేస్ ,ఎంబ్రాయిడరీ లతో పూసలు ,కుచ్చులతో ఇంద్ర ధనస్సు వర్ణాలా కలయికతో ఈ లట్కన్లు అమ్మాయిల మనసు దోచుకొన్నాయి. పరికిణీ – ఓణీ, గాగ్రా – ఛోళీ, చీర, లెహెంగా… డ్రెస్ ఎలాంటిదైనా పలు వర్ణాల కలయికతో ఆయా దుస్తులకు నప్పేలా లేదా మరో రంగులో వీటిని ఎంచుకుంటున్నారు అమ్మాయిలు. పక్షులు, మువ్వలు, అద్దాలు వట్టి దారాల అల్లికలు కలగలుపుకొని ఈ ఎధ్నిక్ హాంగింగ్స్ ఎన్నో డిజైన్లు వస్తున్నాయి.ఒక వేళ పెళ్ళి కూతురికి అలంకరించాలనుకొంటే పేర్లు సుముహూర్తాలు, వధువరుల ప్రేమ భావాలు అక్షరాల రూపంలో డిజైన్లు చేసి చీరెనో ,బోళాకో తగిలిస్తే ఇక అందమే అందం. బంగారు రంగులతో గ్లిట్టర్ మెరుపులతో భాకీ లట్కాన్ లు తగించుకోవటం ఇవ్వాల్టి కొత్త ట్రెండ్.
Categories