మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకుంటున్నారా? మీ కోసం రోజు ఒకే ఒక్క అరగంట కేటాయించు కుంటున్నారా ? అందరి అవసరాలు చూస్తూ,ఎవరికీ అవసరం అయిన ట్రీట్ మెంట్స్ వాళ్ళకి ఇస్తూ బొంగరంలా రోజంతా పనిచేసే ఆడవాళ్ళు ఒక అరగంట సమయం వాళ్ళకోసం కేటాయించు కొక పోతే ఎన్ని ఒత్తిళ్ళకు గురవు తారు అంటున్నారు పరిశోధికులు హడావిడిగా స్నానం,భోజనం,టిఫెన్ ముగించే ఆడవాళ్ళు కనీసం ఆ తిన్న సమయాన్ని అయినా సెలబ్రేట్ చేసుకుంటున్నారా. హడావిడిగా తినకుండా నెమ్మదిగా ఇష్టమైన ఆహారాన్ని నమిలి తింటూ ఆసమయంలో వేరె పని పెట్టుకోకుండా ఏ పాటో వినడమే చేయకుండా ప్రతి భోజనాన్ని తీరిగ్గ చేయండి. ఉన్నవి అందరికి పంచేసి త్యాగం చేయకండి మీ కోసం ఉన్నవి అయిన అస్వాదిస్తూ తినండి ఓ అరగంట విశ్రాంతిగా గడిపితే రోజంతా పని చేసిన అలసట మాయం అవుతుంది తోటపని,షికారు,విశ్రాంతిలో ఓ పుస్తకం చదవటం ఏదో ఒకటి మనసు చల్లబరిచే ఒక పని చేయడం చాల అవసరం అంటున్నారు.
Categories