Categories
ధ్యానం ప్రాణాయామం ,యోగా పరిపూర్ణ ఆరోగ్యానికి కీలకం అంటున్నారు . గ్రో యాంగర్ లివ్ లాంగర్ పుస్తకంలో దీపక్ చోప్రా . దీర్ఘకాల ధ్యానం ద్వారా శరీర వ్యవస్థ ,వయసును పదిహేనేళ్ళు తగ్గించు కోవచ్చు అధ్యయనాల్లో వెల్లడైందని ఈ పుస్తకంలో నిరూపిస్తూ రాశారు . ప్రాణాయామం ద్వారా శ్వాస పై నియంత్రణ వస్తుంది . యోగా శారీరక మానసిక వ్యవస్థలని ప్రభావితం చేస్తుంది . ఆసనాల వల్ల జడత్వం పోతుంది కదలికలు మెరుగు పడతాయి . కొత్త భావనలో కొత్త వ్యాపకం వల్ల మెదడులో చురుకుదనం వస్తుంది . వయోప్రక్రియ మందగిస్తుంది అంటారు రచయిత. నిజానికి మనసు ఆలోచనల్లో ఎదుగుదల ఆగిపోతేనే నిజమైన వృద్దాప్యం వస్తుంది . చైతన్యం తో ఉంటేనే దీర్ఘాయుష్షు .