Categories
ఎంత ఖరీదైన కాస్మొటిక్స్ కొన్నా వాటి మ్యానిఫ్యక్చరింగ్ డేట్స్ చూసి ఎంచుకోకపోతే దేనికి కాకుండా పోతాయి . ఎంత బిగ్ మాల్స్ అయినా కాస్మొటిక్స్ వందల లెక్కలో అమ్ముడుపోవు . కొన్నింటి పైన వాటి మూలలు తీశాక ఎన్నాళ్ళు వాడుకోవచ్చో ముద్రించి ఉంటుంది . కొన్ని ముందే పాడయి పోతాయి కూడా వాటి టెక్చర్ లో మార్పులు వచ్చినా ,లీక్ అవుతున్నా ,గట్టిపడినా ఆ కాస్మొటిక్ పాడైందని గ్రహించాలి . కాస్మొటిక్స్ లో వాడిన వస్తువుని బట్టి వాటి జీవితకాలాన్ని తేలుచుకోవచ్చు . వాటర్ బేస్ ఉత్పత్తులు ఎక్కువ కాలం ఉండవు . పౌడర్ల రూపంలో ఉండేవి ఎక్కువ కాలం ఉంటాయి ఇక క్రేజర్వ్ టిప్స్ వాడకుండా తాయారు చేసే సహజ ఉత్పత్తులు కూడా తక్కువ కాలంలోనే పాడయి పోతాయి బ్రాండెడ్ కాస్మొటిక్స్ ను ఎంచుకోవటం మంచిది కూడా .