“ఓం శర్వాణి..ఓం గీర్వాణి..ఓం మాయాని      

          వందనం”!!

హైదరాబాదు పాతబస్తీ లో వెలసిన   అమ్మవారి ఆలయం “దర్బార్ మైసమ్మ”.ఆషాఢమసంలో భక్తుల కులదైవం,మహిమలు గల మహిషాసుర మర్దిని అవతారంతో దర్శన భాగ్యం కలిగిస్తుంది.
గోల్కొండ కి వెళ్ళే దారిలో రాజుగారి దర్బార్కి దగ్గర ఉన్నది కాబట్టి దర్బార్ మైసమ్మ అని ప్రసిద్ధి గాంచినది.అమ్మవారిని అక్కన్న,మాదన్న,రామభక్తుడైన రామదాసు,ఛత్రపతి శివాజీ లాంటి ఉద్దండులు ప్రార్థనలు చేసేవారు అని పూర్వ చరిత్ర చెబుతోంది.
ప్రతి మంగళవారం,శుక్రవారం అమ్మవారి    సన్నిధిలో శ్రీ చక్రార్చన వైభవోపేతంగా జరుగుతాయి.ప్రత్యేకించి ఆషాఢమసంలో బోనాలు సమర్పించిన తరువాత తొట్టెల ఊరేగింపు కన్నుల పండుగగా జరుగుతుంది.
అమ్మవారి దర్శనానికి ముందు వాహనమైన సింహానికి నమస్కరించి తరువాత సింహద్వారానికి ఇరుపక్కలా వున్న చండ-ముండా దేవిల దర్శనం అనంతరం దర్బార్ మైసమ్మ  దర్శనం చేసుకోవాలి.

ఇష్టమైన రంగుల: ఎరుపు
ఇష్టమైన పూలు:  ఎరుపు రంగులో ఉన్న పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం.
ఇష్టమైన పూజలు: బోనం ఎత్తడం, శివ శక్తుల ఆట, తొట్టెల ఊరేగింపు,మేక,యాట బలి.
నిత్య ప్రసాదం: కొబ్బరి,చద్ది.

    -తోలేటి వెంకట శిరీష

Leave a comment