చెట్టు మనిషీ ఎప్పటికి స్నేహితులే దట్టమైన దండకారణ్యాలు పోయి ,కంక్రిట్ జింగిల్స్ వచ్చాక మనిషి కి చెట్టు విలువ తెలిసొచ్చింది . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హరిత నగరాలను నిర్మిస్తున్నారు . స్విజర్లాండ్ లోని జెర్ మాఫ్ట్ ప్రసిద్ద పర్యాటక ప్రాంతం ట్రూఫర్ ను కొద్దీ ప్రాంతాలకే పరిమితం చేశారు . నగరంలో ఎక్కువ కాలినడకనే తిరగాలి వాహనాలు అనుమతించరు . స్వీడన్ లోని మాల్మో హరితనగరం భావనాలను గ్రీన్ రూఫ్ లు ,డెన్మార్క్ లోని కోపెన్ హేగన్ గ్రీన్ సిటీ గా ఎదిగింది . అత్యున్నత పర్యావరణ లక్ష్యాలను సాధించిన దేశాలలో ఐస్ ల్యాండ్ మొదటి స్థానంలో ఉంది . దీని రాజధాని రెయ్కజావిక్ భూగోళం పైన అత్యున్నత హరితనగరం ఉంటుంది . ఎటొచ్చి మన దేశంలో ప్రభుత్వమే కొంప ముంచుతోంది . జాతీయ రహదార్లు నిర్మించే క్రమంలో రెండు మూడు వందల ఏళ్ళున్న చెట్లను నిర్దాక్షణ్యంగా నేలకూల్చిన ఘనత మనకే దక్కుతుంది .
Categories