సఖులూ! మరి ఆషాఢమాసం లో  గ్రామదేవతలకి కన్నుల పండుగగా బోనంతో,తొట్టెలతో మొక్కులు తీర్చి చద్ది తో ప్రసాదాలు పెట్టి  అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకున్నారు కదా!!
రండి!!ఈ రోజు బంగారు మైసమ్మ కి మొక్కుదాం.హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో వెలసిన ఆలయం ఈ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం. చూడటానికి చిన్న గుడి అయిన మహిమ గల తల్లి.భక్తులు తమ పిల్లలను,పంట పొలాలను చల్లగా చూడాలని మొక్కుకుని ముడుపులు కట్టడం మొదలు పెట్టారు.
బంగారు మైసమ్మ కటాక్షం కొంగు బంగారం అందుకే ఆమె బంగారు మైసమ్మ.పురాతన కాలంలో ఈ వాతావరణ మార్పులకి రకరకాల వ్యాధులు సోకేవి.ప్రజలు  అమ్మవారికి బోనం,తొట్టెలతో మొక్కులు తీరుస్తామని బంగారు తల్లిని వేడుకున్నారు. చల్లని చూపుల తల్లి కటాక్షంతో సుభిక్షంగా బోనంతో పండుగ చేసుకుంటున్నాం.
       ఇష్టమైన రంగులు:ఎరుపు
        ఇష్టమైన పూలు:అన్ని రకాలైన పూలు
    ఇష్టమైన పూజలు: కోడి,మేక బలి
నిత్య ప్రసాదం: కొబ్బరి,నిమ్మకాయల దండ,చద్ది.

 

-తోలేటి వెంకట శిరీష

Leave a comment