Categories
అడక్కుండానే క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు . వెంటనే డబ్బు కట్టే అవసరం ఉండదు కదా అని ఎక్కువ కార్డ్స్ మెయిన్ టేయిన్ చేస్తున్నారు చాలామంది . ఎక్కువ కార్డులు చిరాకే అంటున్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్స్ . రెండు ఉంచుకొండి ఉపయోగం అంటారు కొన్ని క్రెడిట్ కార్డ్స్ ప్రతిచోటా ఆమోదించరు . అలాటప్పుడు ఇంకోటి అవసరం వస్తుంది . ఎమర్జెన్సీ సమయాలు వస్తూ ఉంటాయి . ఎక్కువ మొత్తంలో డబ్బుకావాలంటే అలాటి కార్డు ఒకటి కావాలి . ప్రయాణాల్లో కూడా ఒకటి కంటే ఎక్కువ కార్డులు ఉపయోగిస్తే బిల్లింగ్ సైకిల్స్ పదిహేను రోజుల విరామం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ఎప్పటికప్పుడు బిల్లింగ్ అవగానే బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.