Categories
మహా గణపతిం మనసా స్మరామి…
వశిష్ఠ వామ దేవాది వందిత…
సికింద్రాబాద్ కంటోన్మెంటులో ఉన్న శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శనం చేసుకుని వద్దామా!!
సకుటుంబ,సపరివార సమేతంగా చూసి తరించవలసిన ఆలయం ఈ గణపతి ఆలయం.ఇక్కడ స్వామి వారి సన్నిధిలో భక్తులు గణపతి హోమం,కొబ్బరి కాయలు ముడుపులు కట్టడం,కోరికలు తీర్చే గణపయ్యకి ప్రదక్షిణాలు చేసి ఆనందంగా కటాక్షం పొందుతారు.
ఈ ఆలయం లో శివ- పార్వతులు,కుమార స్వామి కొలువై ఉన్నారు. భక్తులకు కైలాసం లోకి ప్రవేశించినట్టు ఈ ఆలయం నిర్మించారు.
ఇష్టమైన రంగు: తెలుపు
ఇష్టమైన పూలు: తెల్లని పూలు
నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు.
-తోలేటి వెంకట శిరీష