అన్నదమ్ములూ  అక్కాచెల్లెళ్లు  ఎంత ఎక్కువమంది ఉంటె అంత లాభం అని అమెరికన్ సోషియాలజికల్ అసోసియేషన్ చేసిన ఒక సర్వే లో తేలింది. ముఖ్యంగా విడాకుల తీసుకుని సంఖ్య  చాలా  తక్కువగా ఉంటుందీ అంటున్నారు. అలాగని తోబుట్టువులు భార్యాభర్తల మధ్య వచ్చే తగువులు తీరుస్తారని కాదు. ఒక్కరుగా పెరిగిన వారికంటే ఎక్కువ మందితో పెరిగిన వారిలో ప్రేమానందాలతో పాటు పంతాలు  పట్టింపులూ ఆ వెనకనే పట్టువిడుపులు సర్దుబాటు జీవితంలో ఒక భాగమై పోతాయి. ఈ రకమైన నైపుణ్యాలు అలవర్చుకునేవాళ్లు  వైవాహిక జీవితంలో చాలా  సులభంగా సర్దుకుపోగలుగుతారు. అందుకే కుటుంబం అన్నది ఎంత ఉంటే అంత లాభం అంటున్నారు సామజిక నిపుణులు. ఆలా కాకుండా ఒక్కరు లేదా ఇద్దరు చొప్పున పెరిగిన  వాళ్లలో అన్నది ఈ రకమైన నైపుణ్యాలు తక్కువనీ వాళ్ళకి సర్దుకుపోవటం అన్నది జీర్ణం కాదనీ అందుకే విడాకుల సంఖ్యా ఎక్కవవుతున్నాయంటున్నారు విశ్లేషకులు.

Leave a comment