రీచా మహేశ్వరి ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ సంస్థకు సీఇ ఓ గా ఉంది ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మహేశ్వరి ఢిల్లీ నిఫ్ట్ లో ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ చదివిన మహేశ్వరి అంధ విద్యార్థులకు ఫోటోగ్రఫీ నైపుణ్యాలను నేర్పిస్తుంది. స్పర్శ, దూరం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారికి నైపుణ్యాలు నేర్పుతోంది కొన్ని సాయంతో దూరాన్ని గుర్తించటం లైట్ అడ్జస్ట్మెంట్ వంటివి తెలుసుకోవటం నేర్పాను. 2014 నుంచి వందలాది మందికి ఫోటోగ్రఫీ నేర్పించాను. అందులో తీసిన ఫోటోలతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశానని చెబుతోంది మహేశ్వరి. ఎన్నో అంతర్జాతీయ ఉత్పత్తులకు ఫోటోగ్రాఫర్ గా పని చేసినా మహేశ్వరి ఎన్నో అవార్డ్ లు అందుకుంది.

Leave a comment