వాతాపిగణపతిం భజే..వారణాస్యం….
గణాలకు అధిపతి అయిన గణపతికి వందనాలు.సిద్ధి బుద్ధి ప్రదాతకి నమో నమః
ఏకదంతుడికి ఏకాంతంగా పూజలు చేస్తే వక్రతుండుడు అభయం ఇచ్చే విజయ గణపతి.
సంకటహర చతుర్ధినాడు తప్పకుండా వినాయకుడి ఆలయాన్ని దర్శించిన సర్వ పాపాలు తొలగించి ఙ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఏ కార్యం తలపెట్టిన ముందుగా మూషిక వాహనుడికి ఉండ్రాళ్ళు చేస్తామని మొక్కుకోవల్సిందే.
హైదరాబాద్ అత్తాపూర్లో విజయగణపతి ఆలయానికి రండి ఎంత మహిమ గల దేవుడో తెలుస్తుంది. ఇక్కడ స్వామి వారి సన్నిధిలో ఉపనయనాలు,అన్నప్రాసనలు,అక్షరాభ్యాసాలు వైభవంగా జరుగుతాయి. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు అంగ రంగ వైభవంగా జరుగుతాయి.
ఇష్టమైన పూలు: తులసి తప్ప అన్ని పూలు సమర్పించిన ఆనందంగా కటాక్షం
ఇష్టమైన పూజలు: బాలురకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన.
నిత్య ప్రసాదం: కొబ్బరి, పండ్లు.
-తోలేటి వెంకట శిరీష