ఉదయాన్నే లేవగానే ఏం తాగుతారు అంటే దాదాపు కప్పు కాఫీ అంటారు . కానీ ఈ ఉదయపు తొలి పానీయం శరీరానికి మేలు చేసేదిగా చూసుకొండి అంటున్నారు అధ్యయనకారులు . గోరువెచ్చని నీరు ,నిమ్మ పండులో జీవక్రియ లు సక్రమం గా సాగేందుకు సహకరించే గుణాలుంటాయి . లివర్ ను క్లీన్ చేస్తుంది ఈ పానీయం . కప్పు అల్లం వేసిన టీ తాగితే అది సహజ స్టిము లెంట్ గా పనిచేస్తుంది . మరిగే నీళ్ళలో అల్లం తరుగు వేసి ,టీ బ్యాగ్ వేసి నిమ్మరసం పిండి తాగితే ఆరోగ్యం అన్నమాట . గ్లాస్ నీళ్ళలో మెంతులు నానావేసి ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ మెంతులతో సహా తాగితే కొలెస్ట్రాల్ స్థాయి లు నియంత్రణ లో ఉంటాయి ఇది డయాబెటిస్ కలవారికి మేలు చేస్తుంది .

Leave a comment