Categories
అన్నం తింటే లావయి పోతారని డాక్టర్ల సహా చెపుతూనే ఉంటారు . అందులో పిండి పదార్దాలు అధికం కానీ బరువు పెరిగేడి కార్బోహైడ్రేట్స్ వల్ల కాదు శరీరంలో అదనంగా పేరుకుపోయిన క్యాలరీల వల్ల . శరీరానికి శక్తిని ఇచ్చేవి పిండి పదార్దాలే . మెదడు కండరాల ఆరోగ్యం బావుండాలంటే పిండిపదార్దాల వల్లే సాధ్యం . చైనాలోనూ జపాన్ , పిలిపైన్స్ దేశాల ప్రధాన ఆహారం అన్నమే .కానీ ప్రపంచ ఆరోగ్య సూచి ప్రకారం వాళ్ళలో ఊబకాయం తక్కువే . అన్నంలో ఉండే గంజి పెద్దప్రేగు కాన్సర్ రానివ్వదు . పాలిష్ చేయని బియ్యంలో ఉండే పీచు మలబద్దకాన్ని రానివ్వదు . 100 గ్రాముల అన్నం 34.5కేలరీల ,78.2 గ్రాముల పిండి పదార్దాలు ,6.8 గ్రాముల మాంసకృత్తులు 0.5 గ్రాములకొవ్వు 0.2గ్రాముల కొవ్వుఇంకా పాస్పరస్ ,ఐరన్ ,కాల్షియం ఉంటాయి .