ముత్యాల నగలు ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండుగానే ఉంటాయి. మెరుపు తగ్గకుండా జాగ్రత్త తీసుకొంటే ఎంత కాలమైనా కొత్తగా ఉంటాయి . మేకప్ ఫేర్ ఫ్యూమ్ వంటివి అప్లయ్ చేశాకనే ఈ నగలు ధరించాలి . రాత్రి వేళ హేండ్ ,బాడీ క్రీమ్ లు రాయక ముందే ముత్యాల నగలు తీసేయాలి . మెత్తని పొడి వస్త్రంతో తుడిస్తే చాలు . ముత్యాలు మురికి పట్టినట్లు ఉండి మెరుపు కనిపించక పోతే మైల్డ్ సోప్ కలిసిన నీళ్ళతో శుభ్రం చేయాలి. అమోనియా లేదా అతి కఠినమైన డిటర్జెంట్స్ కలసిన నీళ్ళతో ముత్యాలు కడగరాదు . బరకగా ఉండే వస్త్రం తో శుభ్రం చేసిన ముత్యాల పైన గీతలు పడిపోతాయి . వాటిని ప్రత్యేకంగా ఒక మెత్తని సిల్క్ వస్త్రం తో చుట్టేస్తే చాలు .

Leave a comment