తీవ్రమైన విషాదాలు,నిరాశలు ప్రతివాళ్ళను వేధిస్తాయి. బాధ తట్టుకోలేని స్థితిలో డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. దాని గురించి దీపికా పడ్ కోనే ఎప్పుడు చెపుతోంది, డిప్రెషన్ రోగాలకు స్ఫూర్తి ఇస్తుంటుంది. డిప్రెషన్ లో ఉన్నపుడు ప్రతిక్షణం పోరాటమే. ఎప్పుడు అలిసిపోయినట్లే ఉండేది. నేనైతే డిప్రెషన్ లో ఉన్నానని బయటకు చెప్పాక ఎంతో భారం తగ్గిపోయినట్లు ఫీలయ్యాను. చాలా మంది ఎదో బాధలో ఉండి దాన్ని డిప్రెషన్ అనేస్తు వుంటారు. దాన్ని అర్ధం చేసుకోరు. డిప్రెషన్ ఒక మానసిక అవస్థ పరిస్థితి, అదుపు మన చేతుల్లో ఉండదు. మన నియంత్రణలో కూడా ఉండదు. డిప్రెషన్ లోచి, మందులతో,ఇంకా డాక్టర్లు పర్యవేక్షణలో బయటికి రావాలి శ్రద్ధగా వుండాలి అని చెపుతోంది దీపికా పడ్ కోన్. తీవ్రమైన డిప్రెషన్ కు గురయింది కనుకనే దాని తీవ్రత ఆమెకు బాగా తెలుసు.
Categories