Categories
ఒత్తిడి నుంచి బయట పడాలను కుంటే ఫజిల్స్ పూర్తి చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్ . వాటిని పూరిస్తూ వుంటే ఇంకెన్నో ప్రయోజనాలున్నాయని చెపుతున్నారు. ఏది ఎక్కడ సరిపోతుందో నని ఒకే దానిపై ఆలోచించటం ఎక్కువ సేపు దృష్టి పెట్టటం వల్ల ఇతర ఆలోచనలు రావు ఇది ధ్యానం లాంటిదే మనసులో అలాగే ఒత్తడి ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా వుంటుంది. మెదడు పనితీరు చురుగ్గా అవుతోంది. రకరకాల పద బంధాల వల్ల మెదడులోని కుడి ఎడమల భాగాల పనితీరు మెరుగవుతోంది. పజల్స్ తో మెదడు కణాలు చురుగ్గా పనిచేస్తాయి. రోజు ఫజిల్స్ సాధన చేస్తే విజువల్ స్పాషియల్ రీజనింగ్ పెరుగుతుంది. జిగ్ ని క్రాస్ వర్డ్ ఫజిల్స్ తో జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. అల్జిమర్స్ వంటివి రాకుండా వుంటాయి.