Categories
గ్రంధాలయాలు లేని ఊర్లు ఉండవు . పుస్తక ప్రేమికులు సందర్శించే ఒక దేవాలయం గ్రంధాలయం . పేరులోనే పుస్తకాలకు ఆలయం అనే అర్ధం ఉంది . కానీ డెన్మార్క్ లోని హ్యూమన్ లైబ్రరీకి వెళితే పుస్తకాలు కనిపించవు . మెనూ బోర్డ్ ఉంటుంది . ఆ మెనూ ప్రకారం మనం తెలుసుకోవాలనుకొన్న అంశాన్ని ఎంచుకొంటే ,వెంటనే ఆ అంశానికి సంబందించిన సమాచారం అందించేందుకు ఒక వ్యక్తి అందుబాటులోకి వస్తాడు . సందేహాలకు సమాదానాలు చెపుతారు . డెన్మార్క్ కు చెందిన అబద్ గెల్ అతని సోదరుడు డానీ ,కొందరు సహోద్యోగులు కలసి ఈ హ్యూమన్ లైబ్రరీ ఏర్పాటు చేశారు . వాళ్ళందరూ స్వచ్చందంగా పని చేస్తారు . సమాజంలో ఎదురవుతున్నా సమస్యలపై అవగాహన కలిగించేందుకు సందేహాలు నివృత్తి చేసేందుకు ఈ లైబ్రరీ ఏర్పాటు చేశారు .