వర్షాలు ధారాపాతంగా పడుతున్నాయి . వెండి తీగలు సాగినట్లు ,నేలపైకి దూకిన వర్షం మట్టి తాకిడి పైకెగురుతు అదో అందమైన దృశ్యం పుడమి పచ్చ చీరె కట్టుకున్నట్లు మొక్కలన్నీ పచ్చగా చిగురిస్తాయి . ఈ పచ్చదనం లోని మెరుపుకి కారణం వానచినుకులతో పాటు నేలకు చేరి నత్రజని సర్వ ప్రకృతి ని పరవశింప జేసే వర్షిణికే రంగు . ఎవరైనా దీక్షగా చూసి తెలుపే అంటారు . కానీ ఎరుపు,పసుపు,ఆకుపచ్చ ,నలుపు ఇలా రకరకాలరంగుల్లో వర్షం పడుతుంది వాతావరణంలోని దుమ్ము రేణువులు అందులో కలసి ఉండడమే కారణం . కేరళ లోని కొట్టాయంలో వర్షం రక్తపు ఎరుపులో కురుస్తుంది . ఇలాటి రక్తపు వర్షాన్ని చూసి ప్రజలు భయపడ్డారు గానీ ,ఈ నీటిలో ఉప్పుశాతం లేదని మాంగనీస్,టైటానియం,క్రోమియం ,కాపర్ వంటి పదార్దాలున్నాయి శాస్త్రవేత్తలు చెప్పారు . ఈ వర్షం మాత్రం ప్రకృతి రహస్యమే .
Categories