గతంలో ఎప్పుడూ భోజనం చేయడం అంటే కింద కుర్చుని అరిటాకులో వేడి వేడి గా అన్నీ వడ్డిస్తే తినడమే. తర్వాత నెమ్మదిగా డైనింగ్ టేబుల్స్ వెండి స్టీల్ కంచాలోచ్చి అరిటాకు పక్కన పారేసారు కానీ ఆరోగ్య రిత్యా అరిటాకు భోజనం ఎంతో మంచిదంటారు. అరిటాకులో వుండే మెడికల్ వాల్యూస్ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయిట. పచ్చని అరిటాకులో భోజనం చేస్తే ఆహారం త్వరగా జీర్ణం అవ్వుతుంది. అలాగే మోదుగ ఆకుతో కుట్టిన విస్తరి లో భోజనం చేసినా పిల్లల తెలివితేటలు వృద్ది అయ్యే అవకాశం వుంది. అరిటాకులో భోజనం కడుపులో క్రిములు చంపేస్తుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పంపే శక్తి అరిటాకులో వుందని ఆయుర్వేద వైద్యులు చెపుతారు. అన్నం వేడిగా వందగానే అరిటాకులో వడ్డిస్తే అరిటాకులో వుండే ఔషద విలువలు భోజనంలో కలుస్తాయి. రక్తం శుద్ధి అవ్వుతుంది. శరీరంలో కొత్త శక్తి వస్తుందని చెపుతున్నారు. చర్మ కాంతి మెరుగు పడుతుందని వైద్యుల సూచన. కొన్ని హోటల్స్ లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా ఆకు కట్ చేసి భోజనం పళ్ళెం లో వేసుకున్నా మంచిదే.

Leave a comment