Categories
ఇంటి పనితో ఆయుష్షు పెరుగుతుంది అంటున్నాయి అధ్యయనాలు. కుర్చిల్లో కూర్చుని టి వి తో కాలక్షేపం చేసే వాళ్ళకు అనారోగ్యాలు తప్పవన్నారు . 1000 మందితో చేసిన ఈ అధ్యయనం లో ఇంట్లో భార్యతో పాటు తోడుగా ఇంటిపని ,మొక్కలకు నీళ్ళు క్లినింగ్ మొదలైన పనులు చేసే వాళ్ళు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా ఉన్నారు . ఈ పని పెద్ద కష్టం లేని ఎన్నో గంటల పాటు చేసేది . శరీరం ఎంతో యాక్టివ్ గా ఉండేది . ఒకవేళ రిటైర్ మెంట్ జీవితం గడుపుతున్నా,ఇంట్లో పనులు చేస్తేనే జీవన ప్రమాణం పెరుగుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి . కనీసం ఇంట్లో ఒకటి రెండు గంటల పాటు చేతులు,కాళ్ళు,శరీరం వంచే లాగా ఇంట్లో పనులు చేస్తే జీవిత కాలం ఆరోగ్యంగా ఉంటారని చెపుతున్నారు .