Categories
వర్షం వస్తున్న, చలిగా వున్నా ఇంకేం లేస్తాములే అని వ్యాయామాలు, వాకింగ్ లు ఎగ్గొటేస్తారు చాలా మంది. కానీ ఉదయపు చలిలో వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు కెనడా పరిశోధికులు. చలిలో వ్యాయామం చేస్తే మాములు కన్న చాలా ఎక్కువ సంఖ్యలో క్యాలరీలు ఖర్చు అవుతాయంటున్నారు. వాతావరణం చల్లగా వుంటే శరీరంలో శక్తి చాలా త్వరగ ఖర్చవుతుంది. అంచేత చల్లగా ఉన్న రోజుల్లో ఇంట్లో కంటే బయట వాతావరణంలో వ్యాయామం చేస్తే ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయంటున్నారు చాలా కొవ్వును కరిగించేస్తుంది అంటున్నారు.