Categories
చిన్న కష్టం వస్తే చాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చూస్తుంటారు చాలా మంది. క్షణికావేశం కుటుంబాల భవిష్యత్తు ను దెబ్బతీస్తోంది. అలాంటి వారి ఆలోచనలను ముందే పసిగడితే కాసేపు వాళ్ళతో మాట్లాడితే సులువుగా వారిని అందులోంచి బయట పడేయవచ్చు,ఇందుకోసం కొన్ని హెల్ప్ లైన్ లు పనిచేస్తున్నాయి.కేంద్రం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కిరణ్ హెల్ప్ లైన్ (18005990019) ఆత్మహత్యల నివారణ కోసం ఆసరా (9820466726) తీవ్ర ఒత్తిడి లో ఆత్మహత్య ఆలోచన లో ఉన్న వారి కోసం (040-66202000,040-66202001) (టోల్ ఫ్రీ ) హైదరాబాద్ కేంద్రంగా వన్ లైఫ్ (7893078930) నంబర్లకు కాల్ చేసి కౌన్సెలింగ్ తీసుకోవచ్చు.