చక్కగా చదువుకొంటేనే మంచి ప్రవర్తన ,మంచి వ్యక్తిత్వం ,మంచి ఆరోగ్యం కూడా సొంతం చేసుకోవచ్చని ఇటీవలే ఒక అధ్యయనం వెల్లడైంది.చదువు మధ్యలో ఆపేసిన మూడు లక్షల మంది జీవన శైలి పైన ఒక అధ్యయనం చేశారు డిగ్రీ చదివిన వారి కన్న ఇంటర్ తో ఆపేసిన వారే పలు ఆరోగ్య సమస్యలతో బాధపుడుతున్నారు .వారిలో ఒత్తిడి ఎంతో ఎక్కువగా ఉంది. చాలా మంది గుండె పోటుకు అంచునే ఉన్నారు. తక్కువ చదువు ,తక్కువ సంపాదన జీవితంలో అభద్రతకు దారి తీస్తాయన్న విషయం ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. చిన్న తనం నుంచే పిల్లలు బాగా చదువు కొనే విధంగా తల్లదండ్రులు వారిని ప్రోత్సహించాలి. చదువుతో వారి భవిష్యత్తు ఆరోగ్యం బావుంటాయని అధ్యయనకారులు చెపుతున్నారు.

Leave a comment