పెంపుడు జంతువులను ముఖ్యంగా కుక్కల్ని పెంచుకుంటే శారీరకం గానూ,మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెపుతూనే ఉన్నాయి . అయితే గుండె చికిత్స చేయించుకొన్నవాళ్ళు ఈ కుక్కల్ని పెంచుకునే వారై వుంటే వారు మరింత ఆరోగ్యంగా చాలా తొందరగా కోలుకొన్నట్లు వెల్లడైంది. ఈ మధ్య జరిగిన ఒక అధ్యయనంలో ఇరవై ఏళ్ళ క్రితం గుండె జబ్బుకు గురైన కొందరిని ఎంపిక చేసుకొని,వారిలో కుక్కల్ని పెంచుకునేవాళ్ళని,పెంచుకోనివాళ్లని గురించిన ఒక అధ్యయనం చేశారు. అందులో కుక్కల్ని కలిగిఉన్నవాళ్ళలో ఎక్కువ మంది ఆరోగ్యంగా జీవించే ఉన్నారు . ఈ అధ్యయనంలో ఒంటరి తనం తో పాటు బాధ పడేవాళ్ళని,హృద్రోగులకు అయుష్ల్ పెరిగేలా కుక్కలు తోడ్పడ్డాయని రుజువైంది.

Leave a comment