Categories
నడకతో రోజంతా ఉత్సాహంగా నిలిచేందుకు అవసరమైన శక్తి శరీరానికి లభిస్తుంది . శరీరం మొత్తం కదులుతుంది కాబట్టి శరీరమంతా రక్తప్రసరణ అవుతుంది . నడకతో నాజూకైన శరీరాకృతి సొంతం అవుతుంది . కానీ ఏ కారణం వల్లనైనా కీళ్ళు మొరాయిస్తుంటే మటుకు పరుగులు,నడకలకు బరువు సరైన ప్రత్యామ్నాయాన్నీ ముందే వెతుక్కోవాలి ,కీళ్ళకు మేలుచేసేవి . ప్రభావం చూపనివి అయిన సైక్లింగ్ ,స్విమ్మింగ్ పైయిడ్ క్లయింబింగ్ ఎంచుకోవచ్చు . రన్నింగ్ వల్ల కండరాలు బిగబట్టినట్లు అవుతూ ఉంటే యోగ,లేదా మార్షల్ ఆర్ట్స్ గురించి ఆలోచించాలి . చేతులు భుజాలు ,వెన్నెముక ,పొత్తికడుపు వంటి శరీర భాగాలకు పనికి వచ్చేలా అప్పుడే బాడీ రెసిస్టెన్స్ శిక్షణ తీసుకోవాలి . ఎత్తగలిగిన బరువును కనీసం ఎనిమిది సార్లు వెయిట్ లిఫ్ట్ చేయాలి .