తెల్లని ముత్యాల వంటి బార్లీ గింజల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటినే యువలు అంటారు. బార్లీ ప్రపంచంలో ప్రధానమైన నాల్గవ పంట. మన దేశపు ముఖ్య పంటల్లో ఇది ఆరవ ముఖ్యమైన పంట. శరీరాన్ని దృడంగా, దేహాకృతిని చక్కగా తీర్చి దిద్దుకోవటానికి ఈ చిన్న గింజలు ఎంతో దోహదం చేస్తాయి. సమంగా ముక్కలు చేయబడ్డ బార్లీ ఫ్లెక్స్ రూపంలో రోల్ట్ ఓట్స్ ను పోలి వుంటాయి వీటిలో పోషకాలు ఎక్కువే. బార్లీ ఇతర హాల్ గ్రేయిన్స్ లో మెగ్నిషియం చాలా ఎక్కువే. బార్లీ గడ్డిలో శరీరానికి అవసరం అయ్యే విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. 114 గ్రాముల పచ్చి స్పినాక్ లో కంటే 5 గ్రాములు బార్లీ గడ్డిలో ప్రోటాన్లు పీచు ఎక్కువ మూడు డజన్లు విటమిన్లు ఖనిజాలు ఉన్నా బార్లీ గడ్డిలో విటమిన్లు ఎ ,సి, బి1,బి2,ఫోలిక్ యాసిడ్,ఇరాన్ పొటాషియం క్లోరోఫిల్ సంవృదిగా ఉన్నాయి.
Categories