ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునే ఎన్నో పనులు చేస్తుంటాం. సరైన పోశ్చర్ లో కనుక కూర్చోకపోతే  శరీరంలో అన్ని భాగాల పైన వత్తిడి ఏపీడీ ఇతర భాగాల్లో నొప్పులు వచ్చి శరీరం అలసిపోతుంది అని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. కూర్చునే కుర్చీ లేదా డ్రైవింగ్ సీట్ లో నడుము వెనక రోల్ చేసిన టవల్ లేదా చిన్న దిండు పెట్టుకుంటే వెన్ను సమంగా ఆనుతుంది. అలాగే ఒకే పొజిషన్ లో ఎక్కువసేపు కూర్చోకుండా అప్పుడప్పుడు నిఠారుగా నడుస్తూవుంటే మంచిది. హ్యాండ్ బ్యాగ్  లేదా లాప్ టాప్ బ్యాగ్ ఒకే భుజానికి తగిలించుకోకుండా రోజుకోవైపు మార్చి తగిలించుకోవాలి. అలసి పోతున్నామన్న  కారణంగా వర్కవుట్స్ మానేయవద్దు. వ్యాయామాలు శరీరాన్ని చురుకుగా ఉంచుతాయి. ఎండార్ఫిన్లు విడుదలై మానసికమైన సంతోషం వస్తుంది. ఆరోగ్య వంతమైన అలవాట్లు మంచి నిద్ర పోషకాలు శరీరానికి తగినంత శక్తిని ఇస్తాయి. .

Leave a comment