ఎన్నో అందమైన దుస్తుల్ని ఎక్కువ వాడకుండానే పక్కన పెట్టేస్తాం. కాస్త క్రియేటివ్ గా అలోచించి వాటిని కొత్త రూపంలో ఫ్యాషన్ గా కనిపించేలా మర్చేయోచ్చు. మంచి జరీ అంచున్న పట్టు చీర బీరువాలో అలాగే పడి వుంటే దాన్ని చక్కని కుర్తీ గా మర్చేయోచ్చు. మొత్తం జరీ అంచు ముందు భాగంలోకి వచ్చేలాగ వుంటుంది. అనార్కలీలో ఫ్లోర్ లెంగ్త్ గౌన్లు సందర్భానికొక్కటి కొనుక్కుంటాం కానీ రెండు మూడు సార్లు వేసుకుంటే నచ్చకుండా పోతాయి. వాటిని నాడును వరకు కత్తిరించి ఒక బెల్ట్ ఎలాస్టిక్ గానీ పెట్టించేసి మరో రంగు క్రాప్ టాప్ కొని జత చేస్తే మిడీలా అయిపోతాయి ఇంకొన్ని సార్లు ధరించేందుకు వీలుగా వుంటుంది. వీటిని బ్లావుజులు క్రాప్ టాప్ లు కుట్టించేయవచ్చు. కలంకారీ దుపట్టాతో ఇంకెన్నో ప్లాన్ చేయొచ్చు. ఇంట్లో వాడకుండా పడేసిన డ్రెస్సులు బయట పడేసి, వాటిని ఇంకో రకంగా మర్చోచ్చేమో ఆలోచించండి.

Leave a comment