గ్రామీణ హస్తకళా కారులకు సరికొత్త ఐడియాలు ఇచ్చి కొత్త  డిజైన్లు అందించి ఎన్నో కార్పొరేట్ ఆర్డర్స్ సంపాదించి ఈ కళకి అపూర్వ ఆదరణ సంపాదించి పెట్టింది నవ్యా అగర్వాల్. ప్రాజెక్ట్ Navya Agarwal,డిజైనింగ్ లు డిగ్రీ పూర్తీ చేసిన నవ్య స్వగ్రామం సీతాపూర్. ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో నవ్యకి 90 కిలోమీటర్ల దూరంలోవుంది. ఆ వూర్లో అందరికీ హస్తకళల్లో ప్రవేశం వుంది. మార్కెటింగ్ లేదు. వారికీ ఈ ఊరి వారికీ గుర్తింపు తెచ్చేందుకు ఐ వాల్యూ ఎవ్రీ ఐడియా  పేరుతో  ఒక సంస్థ ఏర్పాటు చేసింది నవ్య. పెన్ స్టాండ్స్ ,గోడ గడియారాలు .ట్రే లు ,కోస్టర్లు , పాత్రలు , చెక్కలతో తయారు చేయగలరు. ఆవూరి కళాకారులు. నవ్య సాయంతో వాళ్ళకి హైద్రాబాద్ ,చెన్నై ,ముంబై వినియోగదారులు దొరికారు. లెన్స్ కార్ట్ ,స్నాప్ డీల్ , అమెజాన్ వంటి సంస్థల ద్వారా కార్పొరేట్ సంస్థల ఆర్డర్స్ వచ్చాయి. ఇవ్వాళ ఆ వూర్లో ప్రతి కళాకారులూ గంటకో 60 రూపాయలు సంపాదిస్తున్నారు. కష్టం ఆలోచన , ఐడియా మార్కెటింగ్ అంతా నవ్య అగర్వాల్ దే. ఆవూరి కళే  మారిపోయింది.

Leave a comment