Categories
భారతదేశంలోని సాంప్రదాయ వాయిద్యాలు అన్ని వెదురు తోనూ ,కొమ్ముతోనూ ,తోలుతోనే ,చేసినవే ఉంటాయి . బహుశా అవి తయారు చేసే కాలానికి ఇనుము ఉందో లేదో . అవన్నీ ఒక్క త్రిపుర రాష్ట్రం లోనే ఉంటాయని పిస్తుంది . శ్రీ కృష్ణుని మురళి ,శివుడు ఢమరుకం ,నారదుడి చేతిలో ఆడే చిడతల వంటివి ఇప్పటికీ ఇక్కడ వాడుతుంటారు . వేణువు,లెబాంగ్ ,లెబాంగ్డ్ ,ఢాంగ్దా అని పిలిచే వాయిద్యాలు త్రిపుర వాసులు కొత్త ఆలోచనల లోంచి పుట్టినవి . ఇంకాఎన్నో రకాల వాయిద్యాలు మెడలో తగిలించుకొని వాయించేవి కూడా ఉన్నాయి . త్రిపుర సంస్కృతి,సంప్రదాయ నృత్యాల్లో ఇవన్నీ భాగంగానే ఉన్నాయి ఇప్పటికీ .