Categories
బరువు పెరుగుతామన్నా భయం అవతల పెట్టి రోజు ఓ స్పూన్ వెన్న తినమంటున్నారు ఎక్సపర్ట్స్ ఇందులో వుండే విటమిన్-ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చర్మ వ్యాధులను నివారిస్తుంది చర్మం కాంతి వంతంగా మెరిసిపోతుంది. వెన్నలోని డి విటమిన్ తో శరీరానికి కాల్షియం అందుతుంది. ఇందులోని లెసిథిన్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ప్రత్యేక పోషకాలు మెదడును చురుగ్గా వుంచుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతోంది. వెన్న తో అందం కూడా సొంతం అవుతోంది. ఒంటికి వెన్న రాసుకొని అరగంట ఆగి పెసరపిండితో నలుగు పెట్టుకొని స్నానం చేస్తే కాంతి వంతం అవుతోంది . పసి బిడ్డల లేత చర్మానికి కూడా వెన్నతో మసాజ్ మేలు చేస్తుంది.