Categories
పొడవాటి జుట్టు కోరుకొనే వారికీ ఎక్స్ టెన్షన్లు ఇప్పుడు గొప్ప అవకాశం . వీటి ద్వారా శిరోజాల స్వరూపాన్ని మార్చేయవచ్చు . సింథటిక్ ఎక్స్ టెన్షన్లు కాస్త చౌకగా దొరుకుతాయి . తాత్కాలికంగా వాడుకోవచ్చు . సహజ వెంట్రుకల ఎక్స్ టెన్షన్లు మంచి క్వాలిటీ తో సంవత్సరం వరకూ బావుంటాయి . తాత్కాలిక ఎక్స్ టెన్షన్లు క్లిప్స్ తో పిట్ చేస్తారు . వీటిని ఎవరి సాయం లేకుండానే అమర్చుకోవచ్చు . చిన్నిచిన్ని రింగ్స్ కు వెంట్రుకలు ఎటాక్ చేసి సొంత శిరోజాలతో కలుపుతారు . ఈ హెయిర్ ఎక్స్ టెన్షన్లుపరిశుభ్రంగా ఉంచుకోవాలి ,చిక్కులు పడకుండా నిద్రించే సమయంలో తలచుట్టూ సిల్క్ క్లాత్ కట్టుకోవాలి . ప్రత్యేకంగా తయారుచేసిన షాంపూలు వాడుకోవాలి . జుట్టు పొడవును వాడే ఎక్స్ టెన్షన్లుఇప్పుడు చాలా పాప్యులర్ .