Categories
ఎరుపు నించి ఊదా వర్ణం వరకు రంగులతో వికశించే వెయ్యి రేకుల పద్మం . గుండ్రని బంతిలాగా మొత్తంగా వెయ్యి రేకుల ఈ పద్మం అద్భుతమైన సువాసనతో కూడా ఉంటుంది . ఈ తామరజాతి పువుపేరు బై కీఆన్ యే . కాస్త ఆకుపచ్చ కలగలసిన తెల్లని పూలు ఇంకెంతో అందంగా ఉంటాయి . చైనాలోని భౌద్ద అరోమాల్లో ఎక్కువగా కనిపించే ఈ పూలు అక్కడ ఎంతో పవిత్రంగా భావిస్తారు . భౌద్ధమతంలో సహస్రదళ పద్మం ఎంతో ముఖ్యమైంది . ఈ పద్మంలో దళాలను ఏకాగ్రతతో చూస్తే మెదడు పనితీరు మెరుగవుతుందని నమ్ముతారు . ఎరుపు దగ్గరగా ఉండే రంగుల్లో ముదురు ఎరుపులో ముద్దమందారం లాగా మెరిసిపోయే ఈ పూవు కొన్ని రోజుల పాటు విడిపోకుండా ఉంటాయి .