గ్రీన్ టీ లిప్ స్క్రబ్ తో పెదవులకు పోషణ అందటమే కాదు,మృతకణాలు పోయి పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అరకప్పు చొప్పున చెక్కర,వెన్న మెత్తగా దంచిన గ్రీన్ టీ పొడి తీసుకోవాలి. ముందుగా గ్రీన్ టీ పొడి,చెక్కర బాగా కలిపి వేడి చేయాలి దీన్ని కరిగిన వెన్నలో వేసి చల్లారక ముందే ఒక పాత్రలోకి తీసుకొని మూతపెట్టాలి . ఈ మిశ్రమం ఫ్రిజ్ లో పెడితే కొన్ని గంటలకు గట్టిగా అయిపోతుంది. దీనితో పెదవులు రుద్దుకొంటే మృతకణాలు పోయి ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒక పెద్ద స్పూన్ బ్రౌన్ షుగర్ అరచంచా బాదం నూనె కలిపి దీనికి పిప్పర్ మెంట్ నూనె,తేనె కలిపి ఒక పాత్రలోకి తీసుకోవాలి ఈ మిశ్రమం కూడా పెదవులకు మేలు చేస్తుంది ఇదే పెదవులకు పోషణ అందించే స్క్రబ్ దీనితో పెదవులు రుద్దు కొంటె మృతకణాలు పోయి చక్కగా ఉంటాయి.
Categories