1916లో ఒక నర్స్ గా పనిచేస్తున్న మార్గరెట్ శాంగర్ ని కొన్ని కరపత్రాలు పంచిన కారణంగా అరెస్ట్ చేశారు.జైల్లో పెట్టారు. కానీ అదే కరపత్రాల్లోని విషయాలు జైల్లో అందరికి బోధించారు. ఇంతకీ ఆ కరపత్రాల్లో ఏముందంటే కుటుంబ నియంత్రణ సలహాలున్నాయి. ఆ రోజుల్లో అలాంటి విషయాలు చెప్పటం నేరం. కానీ శాంగర్ ధైర్యంగా ప్లాన్డ్ పేరెంట్ హుడ్ అన్న సంస్థని స్థాపించింది. ఆ కేంద్రం ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మారింది. ఆ ఉద్యమం మొదలై అక్టోబర్ నేలతో వందేళ్ళు. శాంగర్ ఉద్యమం చేపట్టడానికి కారణం ఆమె తల్లి 22 సార్లు గర్భం ధరించి తీవ్రమైన అనారోగ్యంతో 49 ఏళ్లకే చనిపోయిందట. శాంగర్ ఆ పిల్లల్లో ఆరో అమ్మాయి. ఈ కుటుంబ నియంత్రణ కార్యక్రమం చేపట్టి శాంగర్ భారతదేశం వచ్చి మహాత్మాగాంధీ తోనూ సమావేశమైంది. ప్లాన్డ్ పేరెంట్ హుడ్ ప్రస్తుత అధ్యక్షులు సిసిలీ రిచర్డ్స్. ఇప్పటికీ చాలా మంది నిరుపేద మహిళలకు ఈ ఉద్యమం అందలేదంటుంది సిసిలీ రిచర్డ్స్.

Leave a comment