Categories
అనేక దేశాల్లో ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ పార్కులు వచ్చాయి ఈ ఓపెన్ జిమ్స్ పైన వృద్దులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దవాళ్ళ మనసుకి శరీరానికి ఉత్సహం తెచ్చే వ్యాయమ పరికరాలు ఉండేలా వీటిని తీర్చి దిద్దుతున్నారు. మోటార్ సైకిల్ రైడింగ్ గుర్రపుస్వారీలు,దీర్ఘవృత్తా కార చెక్క ఉయ్యాలలు నడక సామర్ధ్యాన్ని పెంచే మెట్ల మార్గాలు,అలసిన సమయంలో కూర్చొని ఆడుకునే ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఈ సీనియర్ సిటిజన్స్ పార్కులు పెద్దవాళ్ళ మధ్య స్నేహాలు పెంచి వాళ్ళలో మానసిక ఉల్లాసాన్ని కలిగించి ఆయుష్ష్ పెంచుతోంది . శారీరక,మానసిక దృఢత్వం పెంపొందించుకొనేందుకు ఈ ప్లేగ్రౌండ్ పార్కులు ఎంతో ఉపయోగ పడతాయని చెప్పటంలో సందేహంలేదు.