వాతావరణం వేడెక్కుతోంది అంటే సాధారణంగా మెత్తని చీరలపైనే చూస్తారు ఆడవాళ్లు. వయసుతో సంబంధం లేకుండా అందరి దృష్టిని ఆకట్టుకునేవి అందమైన కలంకారీ ప్రింట్ కాటన్ చీరలు తెల్లని కోర బట్టను బాగా ఉతికి కరక్కాయ రసం లో నానబెట్టి ఆ ఆరిన బట్టల పైన బ్లాక్ ల ద్వారా మొదటి డిజైన్ వేస్తారు. ఈ బ్లాక్ లను వివిధ డిజైన్లలో టేకు చెక్కతో చేస్తారు ఇలా డిజైన్ అద్దిన చీరలను బాగా నాననిచ్చి ఉడకబెట్టి ఆరవేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ కలంకారి పనికి వాడే రంగులు కూడా ప్రకృతి సిద్ధమైనవే దానిమ్మ పొడి ఉల్లిపాయ పొట్టు బంతిపూల రేకులు అడవుల్లో ఉండే రకరకాల చెట్ల వేళ్ళతో ఈ రంగులను తయారుచేస్తారు. ఈ కలంకారీ రంగులు అద్దిన బట్టతో బట్టలు పార్టీలకు వేసుకునే బ్లౌజులు లెగ్గింగ్స్ కోసం డ్రెస్ మెటీరియల్స్ అలాగే చక్కని చీరలు తయారు చేస్తారు. ఒకప్పుడు కలంకారీ లో కాటన్ చీర మాత్రమే ఉండేవి ఇప్పుడు సిల్క్ చీరలకు కూడా కలంకారీ డిజైన్స్ అద్దుతున్నారు కలంకారీ నానాటికీ ఆదరణ పెరుగుతూనే ఉంది.

Leave a comment