కోవిడ్ వారియర్ గా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రశంసలు అందుకొన్న ఎస్.ఐ ఇందుమతి భారత మహిళ ఫుట్ బాల్ జట్టు తరఫున ఆడుతోంది మైదానం లో చిరుత లాగా ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ఇందుమతి చెన్నై నగర వీధుల్లో అల్లరి మూకల్ని అదుపులో పెడుతూ కోవిడ్ కేసులు భారీగా ఉన్నప్పుడు జనాన్ని అప్రమత్తం చేస్తూ తీరిక లేకుండా ఉంటుంది. ఎంతో పేదరికం నుంచి వచ్చిందామె ఒక కూలీ కూతురు. స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుని ప్రోత్సాహంతో ఫుడ్ బాల్ పై మమకారం పెంచుకుని చదువును ఆటల్ని సమన్వయం చేసుకుని స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం దక్కించుకుంది. ఈ క్రీడా రత్నం ఎందరికో ఆదర్శం.

Leave a comment