ఇంత తక్కువ సమయంలో స్టార్ డామ్ ఎలా వచ్చిందో నాకే అర్ధం కాలేదు. నటనలో శిక్షణ తీసుకోలేదు. సినిమా సినిమాకు నాలో నటనను మెరుగు పరుచుకున్నాను ఇదంతా నా అభిమానుల అభిమానమే అనుకొంటాను అంటుంది రష్మిక మందన్న . ఊహ తెలిసినప్పటి నుంచి నటన పైనా ఆసక్తి వుంది. నేరుగా నటి అవ్వాలంటే సాధ్యం కాదు కనుక మోడల్ గా పలు ఉత్పత్తులకు పనిచేసిన తర్వాత అవకాశాలు రావటం మొదలయ్యాయి. తోలి చిత్రమే విజయాన్ని అందించింది. ఏ పనయినా నావల్ల కాదు అనుకుంటే అడుగు ముందుకు పడదు. ఆత్మవిశ్వసం తోనే ఈ రంగంలోకి అడుగు పెట్టాను. ఇక వెనకడుగు వెయ్యవలసిన అవసరం లేకుండా పోయింది.

Leave a comment