Categories
కాలిఫోర్నియా లోని గిల్రాయ్ గార్డెన్ కు వెళ్ళి చూస్తే అక్కడ ఏ చెట్టు చెట్టు ఆకారంలో కనిపించవు నాలుగు కాళ్ళుంటాయి ,లేదా స్ప్రింగ్ ఆకారంలో వుండచ్చు,చెట్టే డిజైనర్ గా తననుతాను చుట్టేసి కొన్నట్లు కనిపించవచ్చు . ఇలా విత్త ఆకారాలలో కనిపించే వీటిని సర్కస్ చెట్లు అంటారు . అక్సల్ ఎర్లాండ్ అనే రైతు ఇలా చెట్లు పెరుగు తున్నపుడే వాటిని ఎన్నో ఆకారాల్లో తీర్చిదిద్దాడు . ఆ టెక్నీక్ ఏమిటో అతను ఎవ్వరికీ చెప్పలేదు . ఒక చెట్టుకి 60 ఏళ్ళ పైనే వయసు ఉంటుంది . 1985 లో మైకేల్ ఖాన్ ప్లాంట్ అన్న కోటీశ్వరుడు వీటిని కొని కాలిఫోర్నియా లోని గిల్రాయ్ గార్డెన్ కు తరలించాడు . వీటిని చూసేందుకు వచ్చే సందర్శకుల తాకిడికి ఎక్కువే అంటారు నిర్వాహకులు .