కుటుంబంలో అమ్మాయిలు వద్దనుకునే ఒక ఐఏఎస్ ఆఫీసర్ మూడవసారి కడుపుతో ఉన్న భార్య కు పుట్టబోయేది అమ్మాయే అని తెలుసుకుని ఆమెను హత్య చేస్తాడు.అతని పెద్ద కూతురు రుజుతా హత్యను కళ్ళారా చూస్తుంది. పెరిగి పెద్దదై లాయరై ఆ కేసును తిరగ తోడుతుంది. ఎన్నో రుజువులు సాక్ష్యాలు సేకరిస్తుంది చివరలో ఆఫీసర్ రెండవ భార్య కొడుకు కోర్టుకు వచ్చి అతను ఎంత క్రూరమైన వాడో కోర్టులో చెబుతాడు.చేతిలో ఉన్న ఫోన్ లో ప్రతి విషయం రికార్డ్ చేసే అలవాటున్న అతని కొడుకు ఒకసారి తన తల్లిని కొడుతూ,నేనే నా మొదటి భార్యను హత్య చేశానని చెబుతున్న వీడియోని సాక్ష్యంగా ఇస్తాడు.ఆఫీసర్ చేతిలో హింస అనుభవిస్తున్న ఆ రెండవ భార్య కొడుకు సాక్ష్యం తో అతనికి యావజ్జీవ శిక్ష పడుతుంది ఆడపిల్లల పట్ల వివక్ష ఏ రూపంలో ఎంత తీవ్రంగా ఉంటుందో చూపించారు ఈ సినిమాలో ప్రైమ్ లో ఉంది ఈ సినిమా.
రవిచంద్ర. సి 
7093440630    

Leave a comment