అదృష్టం తలుపు తట్టేప్పుడు తలపునే చూసిందట తలుపు వెనక ఎవరున్నారని చూడదట.. శ్రమ కష్టంతోనే అదృష్టపు వాకిలి కూడా తెరుచుకుంటుంది ఇది నిజ జీవిత కథ ‘దుర్యోధనుడి వేషంలో ఎంతో గొప్ప గా ఉన్నావు నువ్వు  అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరు అన్నాడు’ ఒక డ్రైవర్ తన కండక్టర్ శివాజీ రావు తో నా పరిస్థితి నీకు తెలియంది కాదు నెలఖరుకు జీతం డబ్బు రాకపోతే రోజులు గడవటం కష్టం..గవర్నమెంట్ ఉద్యోగం ఎలా  వదులుకోవటం అన్నాడు. కండక్టర్ శివాజీ వద్దు నీ ఖర్చులు రెండేళ్ళ శిక్షణా ఖర్చులు  నేను భరిస్తాను మద్రాస్ వెళ్ళు అన్నాడా మిత్రుడు. అప్పుడు కండక్టర్ యాక్టర్ గా శిక్షణ పొందాడు. బాలచందర్ అవకాశం ఇవ్వగానే నటుడిగా మారాడు మిత్రుడి రుణం తీర్చుకున్నాడు. సినీ నటుడిగా అనితర సాధ్యమైన విజయాలను సాధించారు. సి. బి. ఎస్.  సి ఆరవ తరగతి పాఠ్య పుస్తకంలో ఆయన కథ పాఠంగా ఉంది అతనే రజినీకాంత్ మనిషికి అసాధ్యం ఏముందీ ? అదృష్టపు వాకిలి ఎదురుగా నిలబడి ఆ అవకాశాన్ని వినియోగించుకొని జీవితంలో ఎదగాలి కఠోరమైన శ్రమ ఒత్తిడి ఎదురుకోవాలి విజయం అతని కోసం ఎదురుచూస్తుంది.
చెబ్రోలు శ్యామసుందర్  
9849524134

Leave a comment