Categories
చలికాలంలో వెంట్రుకలు దృడత్వం పొగొట్టుకుని కొసలు దెబ్బతినకుండా ట్రిమ్మింగ్ చేయించుకోవడం మంచిది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అలగే షాంపు అయ్యాక జుట్టును కండీషనింగ్ చేయడం తప్పనిసరి. చలికాలంలో డీప్ కండీషన్ వల్ల వెంట్రుకలు పొడిబారిపోతాయి. ఈ కాలంలో రోజు తలస్నానం చేస్తే వెంట్రుకలకు పోషణ ఇచ్చే సహజ నూనెలు తొలగిపోయి జుట్టు బలహీనంగా జీవం పోయినట్లు కనిపిస్తుంది. వారంలో రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. కొబ్బరి నూనె,బాదం నూనెతో తలకి తరచు మసాజ్ చేసుకోవాలి. దీనితో తల పై రక్తప్రసరణ బాగా జరుగుతుంది వెంట్రుకలకు అవసరమైన పోషకాలు అందుతాయి.