ఇంట్లో చిన్న బాల్కనీ ఉన్నా కాస్త శ్రద్ధ తీసుకుంటే అక్కడ చక్కని మొక్కలు పెంచుకోవచ్చు బాల్కనీ లో మొక్కలకు పోసే నీళ్లు బయటికి వెళ్లే మార్గం ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు పెట్టకుండా తేలికైన కుండీలు ఉంచాలి సువాసనలు వెదజల్లే పూల మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది. తులసి,రోజ్ మేరీ,లావెండర్ వంటి మొక్కలు ఎంచుకోవచ్చు స్థలం తక్కువగా ఉంటే వర్టికల్ బాల్కనీ ఎంచుకోవాలి. వాల్ బకెట్స్ లో రంగు రంగు పూలు పూసే మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది. బాల్కనీ లో ఎండ పడే అవకాశం ఉంటే కాక్టస్ వంటి మొక్కలు మంచివి. బోగన్ విల్లా, అరేబియన్ జాస్మిన్, శంఖపుష్పి, గులాబీ, లిల్లీలు, మేరీ గోల్డ్, మార్నింగ్ గ్లోరీ వంటి మొక్కల చాలా అందంగా ఇస్తాయి.

Leave a comment