ఒక్క సీజన్ లో ఒక్కొ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. అమ్మాయిలకు ఇప్పడు స్కర్ట్ లు నచ్చుతున్నాయి. వీటిల్లో వెరైటీలు కనబడతున్నాయి.సరైన టాప్ తో జత చేస్తే ఇంకా అందంగా కనిపించవచ్చు. ఇప్పుడు ముదురు రంగు ప్రింట్లు గ్రాఫిక్ డిజైన్లు ఉన్న స్కర్ట్ లు ఎంచుకోంటే వాటికి తెల్లని టాప్ బావుంటుంది. అలాగే చక్కని జైపూర్ ప్రింటెడ్ కాటన్ స్కర్ట్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఈ లాంగ్ స్కర్ట్ లకు చిన్న టాప్ బావుంటుంది. స్కర్ట్ మొత్తంగా డీ ప్రింట్ గనుక టాప్ చక్కని సాధా వైట్ టాప్ లు బావుంటాయి. మెరిసే మెటాలిక్ సీక్వేన్స్ స్కర్ట్ లు పార్టీల్లో అందంగా ఉంటాయి. వీటికి టాప్ లు మెరుపులు లేకుండా పూర్తి ప్లెయిన్ టాప్ లు వేస్తే బావుంటాయి.స్కర్ట్ కి చక్కని మ్యాచింగ్ టాప్ తోడైతేనే అందం.

Leave a comment